చెడు వినవద్దు, చెడు చూడవద్దు,చెడు మాట్లాడవద్దు అనే దానికి తోడు చెడు పోస్టులు పెట్టవద్దు అని ఆ మూడు కోతులకు తోడుగా నాలుగో కోతి కూడా వచ్చేసింది.
ఈ విషయంలో అందర్నీ చైతన్యం చేయాల్సిన బాధ్యతను కొంత మంది తీసుకున్నారు.సోషల్ మీడియాను మంచికే వాడుదామని ఏపీ మొత్తం పోస్టులతో నింపేస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. సినీ తారాలతోనూ సందేశాలు ఇప్పిస్తున్నారు. ఈ పోస్టర్లు అన్నీ వైరల్ అవుతున్నాయి. నటీనటులు చెప్పే మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.
సోషల్ మీడియాను మంచికి వాడుతున్న వారి సంఖ్య పది శాతం ఉంటుంది…మిగతా 90 శాతం అసత్య ప్రచారాలకు… దూషణలకు ..మోసాలకు వాడుకుంటున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
