ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. నరేందర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, VNR ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరింపజేస్తూ, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
