జమ్మికుంటలో చెత్త సేకరణపై విద్యార్థులకు అవగాహన
తడి–పొడి చెత్త వేరు చేయాలన్న కమిషనర్ పిలుపు

జమ్మికుంట: రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ విద్యార్థులకు తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంటికి చెత్త డబ్బులు అందించామని, తడి చెత్తతో ఎరువులు తయారు చేస్తున్నామని, పొడి చెత్తను వేరు చేయడానికి 10 మంది సంఘ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. చెత్త వర్గీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

