జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న – సదానందం మార్కెట్ కమిటీ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జమ్మికుంట యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రాచపల్లి జగన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ క్యాడర్ ని బలోపేతం చేసి కష్టకాలంలో కూడా పార్టీని విడకుండా సేవలు అందించినందుకు ఈరోజు ఆయనకి దక్కిన గౌరవం అని తెలిపారు. రానున్న కాలంలో కూడా వారు పార్టీకి అండగా ఉంటూ గతంలో ఎంపిటిసిగా పార్టీ సీనియర్ నాయకులుగా సేవలు అందించినందుకు వారికి దక్కిన గౌరవం అని తెలియజేశారు. వారి వెంట మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు మహమ్మద్ తోఫిక్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
