విద్యావంతుల, పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతా.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా….
పట్టభద్రులను బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేశాయి..
నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చేసిన నష్టాన్ని పట్టభద్రులు గుర్తుపెట్టుకోవాలి..
బిజెపి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి….
కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్ , మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీబిజెపి అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నిరుద్యోగులు, పట్టభద్రులు గత బి ఆర్ ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన పేరుతో రెండు పార్టీలు నిరుద్యోగ పట్టభద్రులకు తీవ్ర నష్టం చేశాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాత్కాలిక హామీలతో ఆకర్షించి రెండు పార్టీలు పట్టభద్రులను తీవ్రంగా మోసగించాయన్నారు. ఈ ఎన్నికలు విద్యావంతులైన ఓటర్లకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా కీలకమన్నారు. ఎందుకంటే ఏడాది కింద ప్రతి నెల నిరుద్యోగ భృతి ప్రతి నెల రూ.4000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ , నేటికీ ఏ ఒక్కరికి ఇవ్వలేదని , నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తే నిరుద్యోగ పట్టబద్రులు ఉజ్వల భవిష్యత్తును నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే నిరుద్యోగ పట్టభద్రులకు లోగడ జరిగిన అనుభవాలను, నష్టాలను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మోసాలను గ్రహించి , బిజెపికి ఈ ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. విద్యావంతుల, పట్టభద్రుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారం కృషి చేస్తానని , బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించి అంజిరెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ నాంపల్లి శ్రీనివాస్, వైద రామానుజం, గాజుల స్వప్న, మామిడి చైతన్య , నాగసముద్రం ప్రవీణ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, ఈసంపల్లి మహేష్ ,రాగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
