టేకుమట్ల, ఫిబ్రవరి 5 : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంలో టేకుమాట్ల మండల స్థానిక సర్పంచులను బుధవారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేస్తూ తాజా మాజీ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఉద్దమారి మహేష్ అని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం తాజా మాజీ సర్పంచుల పై ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు, అక్రమ అరెస్టులతో బైండోవర్ మాజీ సర్పంచుల న్యాయమైన డిమాండ్ల పోరాటాన్ని అణచి వేయలేరని అని అన్నారు,
గతంలో పలుమార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ సమస్యను వారికి విన్నవించిన సందర్భంలో వారు మాట్లాడుతూ పాత సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతామని బూటకపు హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు హామీలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్రంలోని మొత్తం సర్పంచులను మోసం చేశారని దుయ్యబట్టారు,
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేల్కొని తాజా మాజీ సర్పంచుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు,
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు కోలీపాక రాజయ్య, బిలకంటి ఉమేందర్రావు,చదువు మధుర మహేందర్ రెడ్డి,నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
