
మహా గణాదిపతి వీడియో సాంగ్ విడుదల
పెబ్బేరు, ఆగస్టు 29:పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టి ఎన్ వై ఆర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ యజమాని టి.ఎన్. ఎల్లా రెడ్డి, జంగి రెడ్డి సంయుక్తంగా రూపొందించిన “మహా గణాదిపతి” వీడియో సాంగ్‌ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, గద్వాల కేశవులు, సూర్యవంశం గిరి, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ గౌడ నాయక్, రాజానగరం కుమ్మరి సత్యం, నాగేంద్రం, అనుపటి రాము, తోట శీను, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
