
తిప్పాయిపల్లి, జూన్ 28 (జిందగీ 9 న్యూస్): రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్న రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం కింద తిప్పాయిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని తలారి ఎల్లస్వామి నాయుడు, మాధగౌని నవీన్ కుమార్ గౌడ్ (యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు), G. బాలరాజు (గ్రామ వర్కింగ్ ప్రసిడెంట్) ఆధ్వర్యంలో నిర్వహించారు. జన్నుంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి స్వచ్ఛందంగా 25 మంది విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు అందించారు.
ఈ సందర్భంగా గుమ్మడం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహారావు మాట్లాడుతూ –
> “ప్రైవేట్ పాఠశాలల్లో కూడా లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త బెంచీలు, గ్రీన్ బోర్డులు వంటి ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తూ, ఈ సదుపాయాలను వినియోగించుకునేలా చేయాలి” అన్నారు.
“ఉపాధ్యాయులు కూడా ఈ సదుపాయాల గురించి గ్రామస్థులకు వివరించి, విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేయాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహదేవుడు, ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయుడు ఓంకార్, గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా రెడ్డి, మాజీ సర్పంచ్ రామదేవి, ఇతర గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
