న్యూఢిల్లీ: భారతదేశ సమృద్ధి అయిన సాంస్కృతిక వారసత్వానికి యునెస్కో గౌరవం దక్కింది. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతతో పాటు, నాట్య కళకు మార్గదర్శకమైన భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టరులో చోటు దక్కించుకున్నాయి.
ఈ విషయం గురించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ గౌరవాన్ని పంచుకుంటూ, భారతీయ పాండిత్య సంపదకు ఇది అంతర్జాతీయ గుర్తింపు అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. “భారతీయతను ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం ప్రతి భారతీయుడికి గర్వించదగ్గ విషయం,” అంటూ మోదీ అన్నారు.
ఇవన్నీ భారత సంప్రదాయ విజ్ఞానానికి, ధార్మిక విలువలకు ప్రపంచ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పండితులు పేర్కొంటున్నారు.
