పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం రోజున పోషణ పక్వాడ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు, కూరగాయల నుంచి లభించే పోషకాలపై అవగాహన కల్పించారు. అనంతరం అన్నప్రాసన మరియు అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
కార్యక్రమంలో ఇన్చార్జ్ సిడిపిఓ బాల్లీశ్వరి, ఏసీడిపిఓ ఝాన్సీ లక్ష్మి, హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు శ్యామల, స్వరూప, మంజుల, సావిత్రి పాల్గొన్నారు. అలాగే గ్రామంలోని చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో పోషకాహారంపై అవగాహన పెరిగేలా చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
