బోయినిపల్లి, ఫిబ్రవరి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన లక్కే రామవ్వ శుక్రవారం తన పనులు ముగించుకుని వేములవాడ నుండి కోదురుపాక (బొడ్డు రాయి) బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసింది.
అయితే, కోదురుపాక బస్టాప్ వద్ద బస్సు నుండి దిగే క్రమంలో TG 17 Z 0031 (కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు) డ్రైవర్, ఆమె పూర్తిగా దిగకముందే బస్సును ముందుకు కదిలించడంతో రామవ్వ కాలుకు గాయమైంది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు లేదా ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై స్పందించారా అనే విషయం కూడా ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
– Zindagi9News
