ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. పశుసంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కానూరులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లా కలెక్టర్ నాగరాణి నేతృత్వంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెల రోజులుగా పలు పౌల్ట్రీల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా చికెన్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిరోధానికి పౌల్ట్రీల పరిధిలో సెక్షన్ 144 అమలు చేయనున్నారు. కాగా, బర్డ్ ఫ్లూ కట్టడి చర్యలపై ఈ రోజు జిల్లా అధికారులతో కలెక్టర్ నాగరాణి సమీక్ష నిర్వహించనున్నారు.
ఇక, వేల్పూరులోని మరో పౌల్ట్రీ ఫామ్‌లోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు సమాచారం. మాంసం దుకాణాలకు అధికారుల నుంచి నోటీసులు అందాయి. ఇంకా అనుమానిత ప్రాంతాల నుంచి సేకరించిన శాంపిల్స్‌పై రెండు రోజుల్లో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
– Zindagi9News ప్రత్యేక ప్రతినిధి

కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన తెలంగాణ ప్రభుత్వం
ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం
