హైదరాబాద్: షెడ్యూల్డు కులాల (SC) వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను కలిశారు.
కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించి, మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో MRPS నాయకత్వం ప్రభుత్వ నిర్ణయంపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిసింది.
ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు.

