జమ్మికుంట పట్టణానికి చెందిన జక్కే కిరణ్మయికి కాకతీయ యూనివర్సిటీ “డాక్టరేట్” ప్రకటించారు. కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జె. కిరణ్మయికి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ డాక్టరేట్ ను ప్రకటించారు. డాక్టర్ కిరణ్మయి ” స్టడీస్ ఆన్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆంటీ మైక్రోబయాల్ యాక్టివిటీ ఆఫ్ ఆక్టినోమైసెట్స్ ఐసోలేటెడ్ రిజోస్పియర్ సాయిల్స్” అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆచార్య పోడేటి శ్రీనివాస్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని ఆబాది జమ్మికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి డాక్టరేట్ పట్టా సాధించినందుకు టెన్త్- 2004 బ్యాచ్ ,స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

