
జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు (45) బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పొలంలో నీటి పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పొలానికి చేరుకుని ఆయనను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.
