లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ ఏఈ

హైదరాబాద్: విద్యుత్ మీటర్ విషయంలో అధికారికంగా మేలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఒక ప్రభుత్వ అధికారి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్‌కు చెందిన టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక మేలు చేసేందుకు) రూ. 16,000 లంచం డిమాండ్ చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, శ్రీనివాసరావు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
