పేదల గడపకు చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం – హుజురాబాద్లో ప్రణవ్ సహపంక్తి భోజనం
సన్న బియ్యం పథకానికి ఊహించని స్పందన
రాష్ట్రంలో ఉచిత సన్న బియ్యం పథకం పేద ప్రజల జీవనోపాధికి దిక్సూచి కావుతోందని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ 13వ వార్డు లోని రేషన్ కార్డు లబ్దిదారులు పోతుల శ్రీవాణి – శ్రీనివాస్ దంపతుల ఇంటికి స్వయంగా వెళ్లి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కడుపు నింపే విధంగా పనిచేస్తోంది. సన్న బియ్యం పంపిణీ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది,” అని అన్నారు.
శ్రీవాణి మాట్లాడుతూ, “మేము తినే అన్నమే ప్రణవ్ తిన్నారు. ఇది మాకు నిజమైన పండుగలా అనిపించింది. గతంలో ఎవరూ అడుగుపెట్టని మా ఇంటికి నాయకుడు స్వయంగా రావడం గొప్ప విషయం.”
ప్రణవ్ పక్కనే కూర్చొని లబ్ధిదారులతో భోజనం చేయడం వారికి ఎంతో ఆనందాన్ని కలిగించిందని నివాసితులు పేర్కొన్నారు. గతంలో దొడ్డు బియ్యం తీసుకొని విక్రయించాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాత్రం ఉచిత సన్న బియ్యం కోసం ప్రజలు స్వచ్ఛందంగా రేషన్ షాపులకు వచ్చి తీసుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఒక్కో కుటుంబానికి నెలకు సుమారు రూ.2500 వరకు ఆదా అవుతుందన్నారు. గృహ జ్యోతి, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ప్రజల ఆర్థిక భారం తగ్గిస్తున్నాయని వివరించారు. ఇలాంటి విశేషమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
