ఇందిరా అధ్యక్షురాలిగా ఎన్నిక

పెబ్బేరు, జూన్ 22 (జిందగీ9న్యూస్):పెబ్బేరు మండలంలో మహిళా సమైక్య సంఘం కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ ఎంపిక జరిగి, ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.
ఈ సందర్భంగా మండల మహిళా సమైక్య అధ్యక్షురాలిగా ఇందిరా, ఉపాధ్యక్షురాలిగా ముష్టి పద్మమ్మ, కార్యదర్శులుగా భాగ్యమ్మ మరియు లక్ష్మి, కోశాధికారిగా ప్రమీల బాధ్యతలు స్వీకరించారు.
ఈ కొత్తగా ఎన్నుకున్న కమిటీకి పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమోదిని మరియు మాజీ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశాన్ని మండల ఏపీఓ అధికారి పర్యవేక్షించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యుగంధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు ఈ రామన్ గౌడ్, మోతే రాములు, మాజీ ఎంపీటీసీ రాజ్ గౌడ్, వినయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, రాఘవేంద్ర చారి, భాను తదితరులు పాల్గొన్నారు.
