
పెద్దపల్లి జిల్లాలో యువతకు శుభవార్త
సినిమా, నిర్మాణ రంగాల్లో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కోర్సులు
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటన
పెద్దపల్లి, ఫిబ్రవరి 09, 2026:
సినిమా మరియు నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో 3 నెలల ఉచిత స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 20, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమాలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, హైదరాబాద్లోని కొండాపూర్ లో ఉన్న NAC అకాడమీలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రధాన కోర్సులు
🔸సినిమాటోగ్రఫీ
🔸వీడియో ఎడిటింగ్
🔸సౌండ్ రికార్డింగ్
🔸డబ్బింగ్ & వాయిస్ ఓవర్ స్కిల్స్
🔸డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్
🔸కన్స్ట్రక్షన్ సేఫ్టీ
🔸మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫినిషింగ్ కోర్సులు
🔸సర్వేయర్, సూపర్వైజర్ తదితర నిర్మాణ రంగ శిక్షణలు
అర్హతలు
సినిమా సంబంధిత కోర్సులకు: 10వ తరగతి ఉత్తీర్ణత
నిర్మాణ రంగ కోర్సులకు: డిప్లొమా / ITI / B.Tech ఉత్తీర్ణత
దరఖాస్తు వివరాలు
స్థలం: సమీకృత జిల్లా కలెక్టరేట్, మొదటి అంతస్తు, రూమ్ నం. 225 – జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం
చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2026
అవసరమైనవి: సంబంధిత ధృవీకరణ పత్రాలు
సంప్రదింపు నంబర్లు: 9963313318, 9000294176
కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
