నంద్యాల జిల్లా పెద్ద పూజర్లలో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు పొట్టు వాములు, రెండు సప్ప వాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కారణంగా సంబంధిత రైతులకు సుమారు రూ. 1,50,000 వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా. ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. స్థానిక అధికారులు, గ్రామస్థులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత రైతులకు ప్రభుత్వ సహాయాన్ని అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
