హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీని “సామాజిక న్యాయ దినోత్సవం”గా అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని శాసనసభ ఆమోదంతో ప్రకటించింది.
ఫిబ్రవరి 4 ప్రాధాన్యత:
👉 2024లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మంత్రివర్గ ఆమోదం పొందిన తేదీ
👉 ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు (A, B, C కేటగిరీలు) మంత్రివర్గ ఆమోదం
👉దశాబ్దాలుగా బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం
ముఖ్యమంత్రి ప్రకటనలో హైలైట్లు:
👉ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక మేరకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది.
👉 కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు జారీ చేయనున్నది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా కులగణన అమలు చేయించేందుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు.
👉ఈ సమస్యల పరిష్కారానికి గతంలో పోరాటం చేసిన, ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం నివాళులర్పించారు.
👉 ప్రతిపక్ష పార్టీలతో పాటు అన్ని వర్గాలు దీనికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయం కోసం కీలక నిర్ణయాలుగా ఇది నిలిచిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
