జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మే 22 (zindagi9news): భూపాలపల్లి – కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం పుష్కర యాత్రలో విషాదం నింపింది. సరస్వతి పుష్కరాల్లో భాగంగా ప్రయాణిస్తున్న కారు & ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన విష్ణు, రజిత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పుష్కరాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో యాత్రికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
