బోయినిపల్లి, ఫిబ్రవరి 18:రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల వద్దకు వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటు ఉట్కూరి నరేందర్ రెడ్డికి వేసి గెలిపించగలరని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంబ లక్ష్మి రాజం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ గౌడ్, నజీర్, రాజశేఖర్, మహిపాల్ రెడ్డి, ఎండీ రఫీ, మండల నరేష్, మహేందర్, బోయిని పర్శరాములు, సుధాకర్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, బోయిని మల్లేశం, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
