ముక్కా వారి పల్లి , ఫిబ్రవరి 18 :
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం లోని జాతీయ ప్రధాన రహదారి, ముక్కా వారి పల్లె బస్సు స్టాప్ వద్ద ఉన్న జీవనజ్యోతి ఆనంద నిలయం కార్యాలయం లో మార్చి 1 నుండి ఉచిత మహిళా టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల కోసం అర్హులైన వారు నమోదు చేసుకోవచ్చు.
ఈ అవకాశాన్ని జీవనజ్యోతి ఆనంద నిలయం చైర్మన్ సుబ్రహ్మణ్యం స్వామి , అరుణా రెడ్డి (గౌరవాధ్యక్షులు, మహిళా శక్తి సేవా ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్, రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రకటించారు.
ముఖ్య గమనిక:
▪️మేనేజర్లుగా పని చేయడానికి 2 మహిళలు, 2 పురుషులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
▪️సంపూర్ణంగా ఉచితం.
▪️ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
సంప్రదించవలసిన నంబర్లు: 📞 9030068619, 9703105755, 7382868619, 7386101853, 8501005384
