కాల్వశ్రీరాంపూర్: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వశ్రీరాంపూర్ మండలంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని పార్టీ నాయకులు, పట్టభద్రులతో చర్చించారు.
క్రమ సంఖ్య 2లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతకు అందించిన ఉద్యోగ అవకాశాలు, రాబోయే అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించి, కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విజయరమణ రావు, ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, ఎండీ మునీర్, రైతు నేతలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
