
వీణవంక, మే 27 (Zindagi9News):
వీణవంక మండలానికి కొత్తగా నియమితులైన తహసీల్దార్ రజితను మండల యూత్ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం అందేలా చూడాలని కోరుతున్నాం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గంధం బాలాసామి, ప్రధాన కార్యదర్శి సాగంటి చంద్రశేఖర్, దాసారపు రాకేష్, సెక్రటరీ ఓరెం అఖిల్, యువజన నాయకులు ఆవాల రామకృష్ణ, మడ్డి కిషోర్, మురహరి అజయ్, చింతల గణేష్, ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేటి మహేష్, దాసారపు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మందల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
