ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో నూజివీడు సీడ్స్ కంపెనీ విన్నర్ గోల్డ్ (ఎన్ ఎంహెచ్ 8413) మొక్కజొన్న పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. గ్రామానికి చెందిన చిన్న పైడయ్య వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
కంపెనీ ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఎం జే శ్రీకాంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్ కంపెనీ 50 సంవత్సరాలుగా రైతు సేవలో కొనసాగుతోందని తెలిపారు. విన్నర్ గోల్డ్ ఇతర హైబ్రిడ్ రకాలతో పోలిస్తే అధిక దిగుబడిని అందిస్తుందని వివరించారు.
విన్నర్ గోల్డ్ ముఖ్య లక్షణాలు:
✔ కండె చివరి వరకు గింజలు నిండుగా రావడం
✔ మంచి రంగు, నాణ్యత కలిగిన గింజలు
✔ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం
✔ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించే ప్రత్యేకత
ఈ క్షేత్ర ప్రదర్శన కార్యక్రమానికి సుమారు 200 మంది రైతులు హాజరయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ ప్రతినిధులైన నీల రాజు, కడిపికొండ తిరుపతిరెడ్డి, మారుతి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
