కరీంనగర్, వావిలాలపల్లి: విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు కళలకు ప్రాధాన్యతనిచ్చేలా అల్ఫోర్స్ విద్యాసంస్థలు వార్షికోత్సవ వేడుకలను ‘బ్లింక్’ పేరుతో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అతిథులు, జ్ఞానసరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థుల సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, “నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన చాలా అవసరం. కళల వైపు దృష్టి సారించడం వారికి బహుముఖ ప్రతిభను అందిస్తుంది” అని సూచించారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు కళలపై ప్రత్యేక శిక్షణ
విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో డా. వి. నరేందర్ రెడ్డి నాయకత్వం లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు ముందంజ వేశాయని అతిథులు ప్రశంసించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం వారాంతపు వినోద కార్యక్రమాలు, కళా నైపుణ్య శిక్షణ, పోటీ పరీక్షల ఏర్పాట్లు చేయడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆకట్టుకునే ప్రదర్శనలు
ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన ‘జనని జనని’, ‘ఛలో…ఛలో వచ్చిందమ్మా…ఆనందం తెచ్చిందమ్మ’, ‘స్నేహితుడా… ఓ స్నేహితుడా’, ‘ఓయ్ బాటసారి.. చూద్దామా మన వేడుకలను’ అనే పాటలు అలరించాయి. అలాగే, నవ్వుల విందుగా ‘జబర్దస్త్’ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు
వార్షిక ప్రణాళికలో భాగంగా విద్యా పోటీలు, ప్రతిభా పోటీలు, కళా ప్రదర్శనల్లో మెరిసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని డా. నరేందర్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఆనందించారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
