న్యూఢిల్లీ: జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ (NEET PG) పరీక్షను వాయిదా వేస్తున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NBE) ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామని మండలి ప్రకటించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని నిర్ణయించడంతో, పరీక్ష కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
NEET PG పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొత్త తేదీ కోసం అధికారిక వెబ్సైట్ను పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష తేదీతో పాటు అడ్మిట్ కార్డులు, సూచనల గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
