అల్ఫోర్స్ ఐఐటి అకాడమీ విద్యార్థుల అద్భుత విజయం:
JEE (Advanced) – 2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకుల పర్వం
📍 కరీంనగర్ | 02 జూన్ 2025
JEE (Advanced) – 2025 ఫలితాల్లో అల్ఫోర్స్ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ కేటగిరీల్లో 1,000 లోపు 4 మంది, 2,000 లోపు 11 మంది, 3,000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణం.

ఈ సందర్భంగా అల్ఫోర్స్ చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ:
మా విద్యార్థుల్లో అజ్మీరా పురుష్తాం నాయక్ 166వ ర్యాంకు సాధించగా,
పి.ఎన్. సాయిధృవ – 557, ఎన్. అనిరుద్సాయి – 657, బి. అదిత్యా – 945,
బి. చైశ్రవ్ రాజు – 1640, ఇ. శశిలాల్ – 1899, కె. విరేంద్రప్రసాద్ – 2120,
డి. కార్తిక్డ్డి – 2150, ఎస్. విఘ్నేష్ – 2293, డి. అభిరామ్ – 2349,
ఎ. శశిప్రితమ్ – 2463, ఇ. అంకీత్ సాయి – 2613, మహ్మద్ అబ్దులాక్ – 2766,
డి. విశాల్ – 2917 ర్యాంకులు సాధించారు.
ఇది మా సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకొచ్చింది.
విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, అల్ఫోర్స్ రూపొందించిన పటిష్టమైన విద్యా ప్రణాళిక ఈ విజయానికి కీలకంగా నిలిచాయని ఆయన తెలిపారు.
NEET & EAMCET ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. విజేత విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన డా. నరేందర్ రెడ్డి, తాను అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
— Zindagi9News ప్రత్యేక వార్త

