
జూలూరుపాడు, మే 24 (Zindagi9News రిపోర్టర్: రామునాయక్) : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో, సింగరేణి కాలరీస్ సహకారంతో త్వరలో జరగబోయే మెగా జాబ్ మేళా కోసం జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకు అవకాశాలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులను ఎంపిక చేసి, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి, మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం జూలూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పెద్దలు లేళ్ల వెంకట్ రెడ్డి సూచనలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ మరియు మండల నాయకులు లేళ్ల గోపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బురం రమేష్, బాధవత్ హరీష్ కుమార్, కోడుమూరు మల్లికార్జున్, బూరుగు నరసింహారావు, వకదాని వీరభద్రం, పదిమళ చందర్రావు, పదిమళ అశోక్, బూరుగు నాగరాజు, కిన్నెర సందీప్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ప్రాంత యువతలో కొత్త ఆశలు నూరుస్తున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
