
హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలగోని రాములు (55) శుక్రవారం రాత్రి తాటి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. తీవ్ర గాయాల కారణంగా రాములు తన జీవనోపాధి అయిన గీత కార్మిక వృత్తికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్థులు కోరుతున్నారు.
