
హైదరాబాద్‌లో నకిలీ ఐఫోన్ ప్యానల్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్‌లో నకిలీ ఐఫోన్ ప్యానల్స్, కవర్స్, కేబుల్స్, ఇతర యాక్సెసరీస్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బస్టు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్న 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి పెద్ద ఎత్తున నకిలీ ప్యానల్స్, ఫోన్లు, యాక్సెసరీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, నిందితులను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. నకిలీ మొబైల్ ఉత్పత్తుల కొనుగోలు చేయకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
