డోన్ పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
APSSDCL చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ప్రత్యేక హాజరు
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా మందిరం లో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ మహోత్సవ పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDCL) చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ ప్రత్యేక సందర్భంలో ముఖ్య అతిథులను ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తి మయమైన వాతావరణాన్ని సృష్టించారు.
ఈ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, ఆరతులు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మారుమోగింది. శ్రీ సాయిబాబా ఆశీస్సులు అందరికీ లభించాలని భక్తులు ప్రార్థనలు చేశారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
