జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకుడు డా. రవీంద్ర నాయక్ , జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గర్భిణీలు, చిన్న పిల్లలు, మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి, వైద్య సిబ్బందిని అభినందించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, సేవల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మెరుగైన సేవల కోసం సూచనలు
ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రజా ఆరోగ్య సంచాలకుడికి వైద్య సిబ్బంది సత్కారం
తనిఖీ అనంతరం, వైద్య సిబ్బంది డా. రవీందర్ నాయక్‌ను బోకే మరియు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డా.రవీంద్ర నాయక్ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్), డా .వెంకటరమణ (DMHO), డా.చందునాయక్ (Dy DMHO), స్వామి (NHM DPO), డా.రాజేష్ (వావిలాల మెడికల్ ఆఫీసర్), మహోన్నత పటేల్, CHO శ్యామ్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, ANM మంజుల, రజిత, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
