కొత్తపల్లి (హెచ్), కరీంనగర్ – మార్చి 10:
అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు జి.కె ఒలంపియాడ్లో విశేష ప్రతిభ కనబరచి పలు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ (G.K) పై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం అని, సమాజంలోని విషయాలను సమగ్రంగా తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో విజయం సాధించగలరని చెప్పారు. పుస్తకపఠనం, వార్తాపత్రికలు చదవడం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
గత నెలలో గ్లోబల్ ఇండియా ఫౌండేషన్, న్యూఢిల్లీ నిర్వహించిన జి.కె ఒలంపియాడ్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.
పతకాలు సాధించిన విద్యార్థులు:
కాంస్య పతకాలు & ప్రశంసాపత్రాలు:
ఎ. మయాంక్ రెడ్డి (4వ తరగతి)
ఎ. మాన్యశ్రీ పటేల్ (5వ తరగతి)
ఎ. అక్షిత నాయక్ (6వ తరగతి)
కె. భువనశ్రీ (6వ తరగతి)
యం. శివెన్ రెడ్డి (7వ తరగతి)
కె. సాయి వర్షిత్ (7వ తరగతి)
యన్. కృష్ణప్రతీక్ (9వ తరగతి)
జి. హెమంత్ జాదవ్ (9వ తరగతి)
కె. విశ్వక్సేన్ (9వ తరగతి)
రజత పతకం & ప్రశంసాపత్రం:
యస్.పి. కృష్ణచైతన్య (7వ తరగతి)
పతకాలు గెలుచుకున్న విద్యార్థులను పుష్పగుచ్చాలతో సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
