
జమ్మికుంటలో మ్యాథ్స్, సైన్స్ క్విజ్ పోటీలు
జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంఆర్సీ భవనంలో మండల స్థాయి గణిత, విజ్ఞాన క్విజ్ పోటీలు నిర్వహించారు. జమ్మికుంట మండలానికి చెందిన పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్మికుంట బాలురకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచారు.
మొదటి బహుమతి : కాసుల విష్ణు ప్రియ
రెండో బహుమతి : కోరపల్లి కె. నిహాన్యా
మూడో బహుమతి : జయదీప్
ఈ ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బహుమతులను ఎంఈఓ హేమలత ప్రకటించి అభినందనలు తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్మికుంట ప్రధానోపాధ్యాయులు బాదం సురేష్, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు.
