జమ్మికుంట : అశ్వేశ జనవాలి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద భక్తులు తండోపతండాలుగా చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

వేలాదిమంది భక్తులు శ్రీరామ నామ జపంతో పట్టణ వీధుల్లో ఉత్సాహభరితంగా ఊరేగించారు. “శ్రీ రామ లక్ష్మణ జానకి! జై బోలో హనుమాన్ కి!!” అంటూ నినాదాలతో పట్టణం మారుమోగిపోయింది.
ఈ సందర్భంగా శ్రీ విద్యారణమాస విద్యాలయం విద్యార్థులు, భక్తుల కోలాటాలతో ఊరేగింపు మరింత శోభాయమానంగా మారింది. పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోగా, ఉత్సవ వాతావరణం నెలకొంది.
నిర్వాహకుల అభినందనలు

ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు ఎర్రబాటి రామచంద్రరావు, బచ్చు తిరుపతి, జక్కోజు సతీష్, ఇంగే శివాజీ, ఆకుల రాజేందర్, పొలసాని సుధాకర్ రావు, గుడికందుల సుదర్శన్, సంపత్ రావు, రవీందర్ రెడ్డి, బోళ్ల సదానంద, దాసరి రవీందర్, హరికృష్ణ, యమసాని సమ్మయ్య రాజిరెడ్డి, శివయ్య తదితరులు తెలిపారు.
కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరించారని నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
(📰 Zindagi9News ప్రత్యేక ప్రతినిధి)
