జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫ్లై ఓవర్పై రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు ప్రమాద భయంతో ఉన్నారని Zindagi9News లో వచ్చిన ప్రత్యేక కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. తక్షణ చర్యలు తీసుకుని, ఫ్లై ఓవర్లో విద్యుత్ దీపాలను మరమ్మతు చేసి వెలిగించారు.
స్థానికులు, వాహనదారులు గత కొద్దిరోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నా, అధికారుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. కానీ Zindagi9News లో ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే, అధికారులు స్పందించి విద్యుత్ దీపాలను సరిచేయడంతో వాహనదారులకు ఊరట లభించింది.
సమస్యను వెంటనే పరిష్కరించిన అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూనే, ఇటువంటి సమస్యలు మళ్లీ ఏర్పడకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కోరుతున్నారు.
– Zindagi9News, జమ్మికుంట
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
