
జమ్మికుంటలో కోర్టుల ఏర్పాటు కోసం న్యాయవాదుల విజ్ఞప్తి
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో ప్రధమ శ్రేణి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని, అలాగే హుజురాబాద్‌లోని సెకండ్ అడిషనల్ కోర్టును జమ్మికుంటకు మార్చాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జమ్మికుంట న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా పోర్టు పోలియో ఇన్చార్జి జడ్జి ఎన్. తుకారంను హైకోర్టులోని వారి ఛాంబర్లో కలిసి మెమోరాండం సమర్పించారు.
ఇల్లంతకుంట, వీణవంక మండలాలతో కలిపి జమ్మికుంట పరిధిలోనే దాదాపు 5 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజలు కోర్టు పనుల కోసం హుజురాబాద్ వరకు వెళ్లాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాదులు వివరించారు. ప్రజల ఆశయాలను గౌరవించి జమ్మికుంటలో కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంగల పవన్‌కుమార్, ఏబూసి లింగారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్ బాబు, నక్క సత్యనారాయణ, మొలుగూరి సదయ్య, హుజురాబాద్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నూతల శ్రీనివాస్, రావికంటి మధుబాబు, గుండ వరప్రసాద్, గూడెపు వంశీకృష్ణ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పిట్టల రాజేష్, బత్తుల రాజేష్, అబ్బరవేణి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే హైకోర్టు న్యాయవాదులు కట్టంగూరి బుచ్చిబాబు, పొన్నం అశోక్ గౌడ్, దయానందరావు, డి.ఎల్.పండు సహకారంతో ఈ భేటీ జరిగిందని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
