
జమ్మికుంట ఫ్లైఓవర్‌పై బస్సు ప్రమాదం… తృటిలో తప్పిన పెను ప్రమాదం
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై శుక్రవారం బస్సు ప్రమాదానికి గురైంది. హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రక్షణ గోడను ఢీకొట్టినట్లు సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు చోటుచేసుకున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహకరించారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, గాయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
