టేకుమట్ల, మార్చి 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం రమేష్ వైన్డింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో విశ్వావసు నామ నూతన సంవత్సరం సందర్భంగా చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రాన్ని మండల ఎస్సై దాసరి సుధాకర్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ, “ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు దాసారపు రమేష్ ప్రతి సంవత్సరం బస్టాండ్ పరిధిలో చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నల్లబెల్లి రమ రవీందర్, మాజీ ఎంపిటిసి ఏనుగు తిరుమల లచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పుప్పాల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
