కరీంనగర్ : అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ సోమవారం రోజున ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ పాల్గొని, వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ట్రస్ట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.
