సిద్దిపేట జిల్లా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ & బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను హిందూ వాహిని మండల శాఖ విడుదల చేసింది.
ఫిబ్రవరి 19 న సాయంత్రం 4:00 గంటలకు సిద్దిపేట ఎల్లమ్మ గుడి నుండి శివాజీ చౌక్ వెంకటేశ్వర దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6:00 గంటలకు శివాజీ చౌక్ లో బహిరంగ సభ జరుగనుంది.
ఈ సభలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పూజ కమలానంద భారతి , ప్రధాన వక్త శ్రీ అప్పల ప్రసాద్ హాజరై ప్రసంగించనున్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ వాహిని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
