బోయినిపల్లి, మార్చి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో చౌడాలమ్మ కళ్యాణంలో భాగంగా యాదవ కులస్తులు ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే చౌడమ్మ కళ్యాణంలో మొదటిరోజు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు.మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనాలు పెట్టుకొని డప్పు చప్పుల మధ్య బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి, పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఏం.సి చైర్మన్ బోయినీ ఎల్లేష్ యాదవ్, యాదవ కులాస్తులు కొండవేని మల్లయ్య , బోయిని పరశురాములు, బోయిని మల్లేశం, బోయిని రాజేశం, కొండవెని నాగరాజు, కొండవేని మహేష్, ఈదుల మహేష్, బోయిని మల్లేశం, ల్యాగల అనిల్, చౌదరి వెంకటేశం, చౌదరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
