తెలంగాణాకు కేసీఆర్ యే శ్రీ రామరక్ష
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినిపల్లి, మార్చి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు ఆదివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో తీర్థం పుచ్చుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేసారని తెలిపారు. అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ యే శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారన్నారు. కనుక రానున్న రోజుల్లో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ బూరుగుల నందయ్య,
యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్, బిసి సెల్ అధ్యక్షులు గురిజాల కోటి, సోషల్ మీడియా కన్వీనర్ లు కమల్ గౌడ్, మ్యాకల మహేష్, గ్రామ శాఖా అధ్యక్షులు రాజారామ్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
