76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్యాపిలి పట్టణంలో గల పాఠశాలలో, పంచాయతీ ఆఫీసు, ఎంపీడీవో ఆఫీస్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ప్యాపిలి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ప్యాపిలి మాజీ ఎంపీపీ అయినటువంటి. తొప్పెల శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో పిల్లలు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు.
