మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్న-కోఠి సహకారంతో పిల్లలకు క్రీడా దుస్తులను పంపిణీ
విద్యార్థులతో కలిసి 76 వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రణవ్.
పాఠశాలల సమస్యలపై ప్రత్యేక దృష్టి
కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల సమస్యలపై సానుకూల స్పందన.

ప్రణవ్ రాకతో సందడిగా మారిన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల.
హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనీ,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినీ స్వప్న-కోఠి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి,క్రీడల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్టును ఎంచుకొని ఆ రంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు.విద్యార్థులు తల్లి,తండ్రి తో పాటు గురువును దైవంగా భావించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని,క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపెట్టడం సంతోషాన్ని కలిగించిందని ఇదే క్రమంలో మరింత ముందుకు వెల్లి దేశ స్థాయిలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
