ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రతిపాదన మేరకు కాలేశ్వరం నూతన బస్టాండ్ విస్తరణ, నిర్మాణానికి రూ. 3.95 కోట్లు, మంథని బస్టాండ్ విస్తరణ పనుల కోసం 95 లక్షలు ఆర్టీసీ కేటాయించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు , జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయించాలని మరియు మంథని బస్టాండ్ విస్తరణ ఆధునికంగా మార్చడానికి 95 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా ఆర్టీసీ బోర్డు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు బట్టి విక్రమార్క , మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నిధులు కేటాయిస్తూ అనుమతులు జారీ చేయడం జరిగింది వారికి శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
కాలేశ్వరం మరియు మంథని బస్టాండ్ విస్తరణ పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.90 కోట్ల నిధులు మంజూరు చేయడంపై మంథని నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
