కరీంనగర్: “జూట్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు, టీచర్లు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి” అని బీజేపీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
స్థానిక బీజేపీ నేతలు, పట్టభద్రులతో కలిసి మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
“కాంగ్రెస్ ఉద్యోగుల, పట్టభద్రుల సమస్యలను గాలికి వదిలేసింది”
▪️కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి ₹4,000 ఇప్పటికీ ఇవ్వలేకపోయింది.
▪️అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అయినా, ప్రతి నిరుద్యోగికి ₹56,000 బకాయిపడింది.
▪️ఉపాధి కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.
“బీజేపీ మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడింది”
▪️బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పట్టభద్రులను మోసం చేసిందని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు.
▪️టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు ముందే ఓటమిని అంగీకరించాయి, అభ్యర్థులు కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు.
▪️ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.
“కేంద్ర నిధులే రాష్ట్రాన్ని నడుపుతున్నాయి”
▪️రాష్ట్ర ప్రభుత్వానికి నడిపించే నిధులన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
▪️దేశాభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారి రాజేంద్రప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్ రెడ్డి, కటకం లోకేష్, పాదం శివరాజ్, మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
